ఆవిర్భావ సభకు భారీగా తరలిరావాలని బొలిశెట్టి సత్యనారాయణ పిలుపు

రంపచోడవరం, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా మార్చి 14 తేదీన పిఠాపురంలో జరిగే ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో జనసేన నాయకులు అందరూ రంపచోడవరం నియోజకవర్గ స్థాయిలోను భారీగా తరలిరావాలని రంపచోడవరం నియోజకవర్గ జనసేన పరిశీలకులు బొలిశెట్టి సత్యనారాయణ పిలుపునిచ్చారు. స్థానిక ఆర్పీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసినా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త కుర్ల రాజశేఖర్, లీగల్ సెల్ అధ్యక్షులు కాకి స్వామి, మండల పార్టీ అధ్యక్షులు పి.శ్రీను, త్రిమూర్తులు, రాజు, రాయుడు, సిద్దు, కుప్పాల జయరాం, లోకేష్, రవి, సురేష్ తదితరులు హాజరయ్యారు.

Share this content:

Post Comment