మానవత్వం చాటుకున్న బొలిశెట్టి శ్రీనివాస్

తాడేపల్లిగూడెం నియోజకవర్గం: తాడేపల్లిగూడెం రూలర్ మండలంలో కొమ్ము గూడెం గ్రామానికి చెందిన చుండ్రు శీను, వీరపాలెం గ్రామానికి చెందిన గంజి దాస్ ఇరువురు ఇటీవలే అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబాలను పరామర్శించి వివిధ అనారోగ్య కారణాలతో మృతి చెందిన కుటుంబాలకు ప్రగట సానుభూతి తెలియజేసి ఇరువురి కుటుంబాలకు 5000 రూపాయలు చప్పున ఆర్థిక సాయం మరియు నిత్యవసర సరుకులు అందించారు. అనంతరం ఆరుళ్ళ గ్రామానికి చెందిన తాడేపల్లి సురేష్ అనే యువకునికి గ్రానైట్ పడి గాయాలపాలవుగా చికిత్స నిమిత్తం 5000 రూపాయలు ఆర్థిక సాయం మరియు నిత్యవసర సరుకులు బొలిశెట్టి శ్రీనివాస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం మండల రూలర్ అధ్యక్షులు అడప ప్రసాద్, మట్ట రామకృష్ణ, కోట శ్రీరామ్, యంట్రపాతి రాజు, మాదాసు ఇందు, చపాల రమేష్, అత్తిలి బాబీ, అడ్డగర్ల సూరి, నల్లగంచు రాంబాబు, అడబాల మురళి, మద్దాల నరసింహ, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్, గట్టిం నాని, సుర్పణ శ్రీను, ఎస్ శ్రీను, సత్యనారాయణ, కామిశెట్టి శ్రీను, సల్మాన్ రాజ్, మరియు జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.