బొలిశెట్టికి పూర్తి మద్దతు పలికిన చిల్లర కూరగాయల వర్తక సంఘం

తాడేపల్లిగూడెం: కూటమి అధికారంలోకి రాగానే వర్తుకల సమస్యలపై పూర్తిస్థాయి పరిష్కారాలు చూపిస్తామని తాడేపల్లిగూడెం కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం కిరాణా వర్తక సంఘం భవనంలో ఏర్పాటుచేసిన చిల్లర కూరగాయల వర్తక సంఘ ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎండనక వాననక షాపులు అద్దెలు కట్టలేక రోడ్లపై పన్నుల పేరుతో వేధిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిన సమయం ఆసన్నమైందని బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రతిదానికి పనుల పేరుతో ప్రజలను పీడించకు తింటున్న వైసీపీ ప్రభుత్వం దారుణంగా ఓడిపోవడం ఖాయం అన్నారు. అవినీతి అనకొండ ల మారిన కొట్టు సత్యనారాయణ తన తనయుడితో సైతం కౌంటర్లు ఏర్పాటు చేసి వసూళ్లకు పాల్పడుతూ సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారు అన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే వర్తక వ్యాపారస్తులకు అండగా ఉంటామని ఎటువంటి పనుల భారం లేకుండా మీ వ్యాపారాలు మీరు చేసుకునేలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. చిల్లర పండ్ల వర్తక సంఘం అధ్యక్షుడు చీరాల శ్రీను, వల్లభ తమ సమస్యలను బొలిశెట్టి వివరించారు. ఎంపీ అభ్యర్థికి కమలం గుర్తుపైన, అసెంబ్లీ అభ్యర్థిగా గ్లాసు గుర్తు పైన ఓటు వేసిగెలిపించాలని బొలిశెట్టి కోరారు. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన అనీల్ ను బొలిశెట్టి ప్రశంసించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బాబ్జి, పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశి, అడబాల నారాయణమూర్తి, రౌతు సోమరాజు, మారం వెంకటేశ్వరరావు, సజ్జ సుబ్బు తదితరులు పాల్గొన్నారు.