ఎన్నికల ప్రచారంతో దూసుకెళ్తున్న బొలిశెట్టి

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలం 34, 35వ వార్డులలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ ఇసుక మట్టిని అమ్మేస్తున్నాడు. పేదల చెల్లించిన టాక్స్ లను కబ్జా చేస్తున్నారు. 13 జిల్లాలు 60 మంది సలహాదారులు. రేషన్ వాహనాల కొనుగోలు రూ.675 కోట్లలో 150 కోట్లు లంచాలకే పోయింది. రంగులకు ఎనిమిది వందల కోట్లు ఖర్చు. ఈ సొమ్ముతో ఎన్ని పట్టణాలు అభివృద్ధి చేయవచ్చో తెలుసా! 108 పట్టణాల్లో రూ.100 కోట్లతో ఎనిమిది మున్సిపాలిటీలు అభివృద్ధి. డబుల్ ఇంజన్ ప్రభుత్వం రాబోతోంది. నా తండ్రి ఆర్టీసీ డ్రైవర్. ఓట్లు అడిగే స్థాయికి వచ్చే మంటే ప్రజల బిక్షే. లంచం తీసుకోలేదని ప్రమాణం చేయి, అవినీతి లేని ప్రజాస్వామ్యం కావాలి. అవినీతి లేని అధికారులు కావాలన్నారు. కుటుంబాల మధ్య కలహాలు పెట్టి వాటిని సెటిల్మెంట్ పేరుతో రూ.20 లక్షలు సొమ్ములు దోచుకున్న వ్యక్తి కొట్టు సత్యనారాయణ అని ప్రభుత్వం పైన స్థానిక మంత్రిగా ఉన్న కొట్టు సత్యనారాయణ పైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.