అన్నదాన కార్యక్రమానికి బొలియశెట్టి శ్రీకాంత్ దంపతుల సహాయం

కొండపల్లి మున్సిపాలిటీ వెంపటివారి వీధి లలిత నగర్ లో శ్రీశ్రీశ్రీ లాలితపరమేశ్వరి అమ్మవారి 18 వ వార్షికోత్సవం సందర్భంగా 7వ తేదీన శనివారం పూజలు కార్యక్రమాలు, 8వ తేదీ అనగా ఆదివారం నాడు అన్నదానం కార్యక్రమం జరుగును ఈ కార్యక్రమానికి బొలియశెట్టి శ్రీకాంత్ విజయదుర్గ దంపతులు మరియు కుమార్తె బొలియశెట్టి అక్షయ చేతుల మీదుగా 150 కిలోలు బియ్యం, 30 కిలోల మంచినూనె, 10 కిలోల కందిపప్పు లాలితపరమేశ్వరి మందిరం దేవస్థానం గుడి ధర్మకర్త టీ.వెంకటశాస్త్రి తనయుడు విశ్వనాథ్ శాస్త్రికి ఇవ్వడం జరిగింది. శ్రీకాంత్ మాట్లాడుతూ కొండపల్లి మున్సిపాలిటీలో నివసించే ప్రజలు అందరు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో లలిత పరమేశ్వరి అమ్మవారు చల్లాటి చూపులతో చూడాలని దేవుడ్ని కోరుకున్నారు. అన్నదానం కార్యక్రమానికి ప్రజలు అందరు రావాలని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు బొలియ శెట్టి శ్రీకాంత్ దంపతులు మరియు పార్థసారథి, రమేష్ పాల్గొన్నారు.