కష్ట కాలంలో నేనున్నా అంటూ.. తన వంతు సాయం చేసిన బాలీవుడ్ నటుడు

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాపిస్తుంది. ప్రతి రోజు లక్షలలో కేసులు నమోదు అవుతున్నాయి. ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యే వారి సంఖ్య క్రమక్రమేపి పెరుగుతుంది. పడక గదలు సరిపోక, ఆక్సిజన్స్ అందుబాటులో లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితులని గమనిస్తున్న సినీ సెలబ్రిటీలు తమ వంతు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. తాజగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ బృహన్‌ముంబయి కార్పొరేషన్‌(బీఎంసీ)కు అండగా నిలిచారు.

అజయ్ దేవగణ్ తన ఎన్‌వై ఫౌండేషన్స్ ద్వారా ముంబైలోని శివాజీ పార్క్‌లో అత్యవసర వైద్య సేవల విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు సాయం అందించారు. శివాజీ పార్క్‌లోని వివాహ వేదికలను కోవిడ్ కేంద్రాలుగా మార్చి 20 పడకలను ఏర్పాటు చేయడంతో పాటు వెంటిలేటర్స్, ఆక్సిజన్ సిలిండర్స్, ఇతర వైద్య సేవలను అందుబాటులో ఉంచింది. గతేడాది కరోనా మొదటి దశలో కూడా ముంబయిలోని మురికవాడ ధారావికి వెంటిలేటర్లు అందించి ఆదుకున్న అజయ్ దేవగణ్ ఇప్పుడు మరోసారి తన బాధ్యతను నిర్వర్తించారు.