అంగరంగ వైభవంగా భారీ ర్యాలీగా బొమ్మిడి నాయకర్ నామినేషన్

నరసాపురం జనసేన పార్టీ కార్యాలయం నుండి నియోజకవర్గ జనసేన, టిడిపి, బిజేపి నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలతో అలాగే ప్రజలందరి ఆశీస్సులతో అంగరంగ వైభవంగా, ర్యాలీగా వెళ్ళి నరసాపురం సబ్ కలెక్టర్ వారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన టిడిపి, బిజేపి పార్టీలు బలపరిచిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి బొమ్మిడి నాయకర్. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టిడిపి ఇంఛార్జి పొత్తూరి రామరాజు, బీజేపీ ఇంఛార్జి మేకల సతీష్, మాజీ శాసన మండలి చైర్మన్ ఎం ఏ షరీఫ్, మాజీ మంత్రి వర్యులు కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ శాసన సభ్యులు బండారు మాధవ నాయుడు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాగంటి మురళీ కృష్ణ (చిన్నా) మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.