వైసీపీ గూండా ఎమ్మెల్యేలు, మంత్రుల వ్యాఖ్యలపై స్పందించిన బొమ్మిడి నాయకర్

నరసాపురం నియోజకవర్గం: ప్రముఖ సినీ హీరో మెగాస్టార్ కొణిదెల చిరంజీవి గారు ఇటీవల ఒక సినిమా ఫంక్షన్ లో మాట్లాడుతూ సినీ పరిశ్రమను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్ళాలి కానీ టికెట్ రేట్లు తగ్గించిన పరిశ్రమకు ఇబ్బంది కలిగించకూడదు అంటూ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రెస్ మీట్ లు పెట్టి చిరంజీవికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పీఏసీ సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ ఖండించారు. ప్రభుత్వం సినీ పరిశ్రమను ఆదుకోవాలని అడుగుతుంటే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చిరంజీవి గారిని రాజకీయాల్లోకి లాగి మాట్లాడడం సమంజసం కాదు అని ఒక ప్రకటనలో తెలియజేశారు. చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన రాష్త్రానికి ఎన్నో రకాలైన నిధులు తీసుకొచ్చారని పేర్కొన్నారు. మీ ప్రభుత్వంలో అప్పులు తప్ప ఇంకేమి లేదని ఎద్దేవా చేశారు. అడిగిన దానికి స్పందించకుండా వ్యక్తిగతంగా దూషించడం సమంజసం కాదని వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు మీద మండిపడ్డారు.