నరసాపురం, మార్చి 14న పిఠాపురంలో జరగనున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభకు నరసాపురం నియోజకవర్గం నుండి భారీ స్థాయిలో కార్యకర్తలు, అభిమానులు హాజరవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ పిలుపునిచ్చారు. శనివారం నరసాపురం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, నియోజకవర్గ స్థాయి జనసేన నాయకులు, మండల మరియు గ్రామ అధ్యక్షులు, జనసేన కార్యకర్తలు, వీర మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు గారు, రాష్ట్ర కార్యదర్శి చాగంటి చిన్న హాజరై పార్టీ అభివృద్ధి, వేడుకల నిర్వహణపై సూచనలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ, జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో, 11 సంవత్సరాలుగా పార్టీ ప్రజాసేవలో కొనసాగుతూ, 12వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఇప్పటి వరకు పోరాటాలతో కూడిన ఆవిర్భావ దినోత్సవాలు చూశామని, ఈ సంవత్సరం ప్రజల ఆశీర్వాదంతో విజయోత్సవంగా నిర్వహించనున్నామని అన్నారు. గత పదేళ్లుగా రాష్ట్ర ప్రజల హక్కుల కోసం పవన్ కళ్యాణ్ అనేక ఉద్యమాలు నిర్వహించారని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న జనసైనికులు ఈ విజయోత్సవ వేడుకలో భాగస్వాములవ్వాలని కోరారు. సభ అనంతరం జనసేన ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ చేయడంతో పాటు, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కటింగ్ చేసి మహిళలకు అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జక్కం బాబ్జి వర్ధనపు ప్రసాదు, కోటిపల్లి వెంకటేశ్వరరావు, వలవల నాని, బందేల రవీంద్ర ,కొల్లాటి గోపికృష్ణ, గుబ్బల మారాజు,మైల వసంతరావు, వాతాడి కనకరాజు, దొడ్డపాటి స్వాములు, అడ్డల నాగేశ్వరరావు, నిప్పులేటి తారక రామారావు మరియు నియోజకవర్గ జనసేన-టిడిపి-బిజెపి నాయకులు, జనసైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment