ఘనంగా బొమ్మిడి నాయకర్ జన్మదిన వేడుకలు

నరసాపురం: నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పీఏసీ సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ జన్మదిన వేడుకలలో భాగంగా నరసాపురం జనసేన కార్యాలయంలో జనసైనికులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి.. అనంతరం నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు మరియు అనారోగ్యంతో చికిత్స పొందుతున్న వారికి పళ్ళు, ఫలాలు అందించారు. తదనంతరం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలతో కలిసి కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో కేక్ కటింగ్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.