బొంతు రాజేశ్వరరావు మిత్రుల ఆత్మీయ కలయిక

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం మలికిపురంలో బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం బొంతు రాజేశ్వరరావు మిత్రుల ఆత్మీయ కలయిక నిర్వహించారు. ఈ నెల 14 తారీఖున ప్రారంభ కానున్న జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ వారహి యాత్రలో భాగంగా 22, 23 తేదీలలో రాజోలు నియోజవర్గంలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ యాత్రకు సంఘీభావం తెలపాలని యాత్ర కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని సమావేశం తీర్మానించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.