సంక్రాత్రి సంబరాల్లో పాల్గొన్న బొర్రా, కన్నా

సత్తెనపల్లి నియోజకవర్గం: సత్తెనపల్లి పట్టణంలోని 12వ వార్డు రాజుల కాలనీలో సంక్రాత్రి సంబరాల్లో పాల్గొన్న జనసేన పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయ కర్త బొర్రా వెంకట అప్పారావు, మాజీ మంత్రి సత్తెనపల్లి టిడిపి ఇన్చార్జ్ కన్నా లక్ష్మీనారాయణ. అనంతరం సంక్రాంతి సందర్భంగా వీరమహిళలకు ఆడపడుచులకు ఏర్పాటుచేసిన ముగ్గుల పోటీలకు సంబంధించి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా బొర్రా వెంకట అప్పారావు మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో రాక్షస పాలన పోయి జనసేన తెలుగుదేశం సంకిర్ణ ప్రభుత్వం వచ్చేలాగా సమిష్టిగా కృషి చేద్దాం. ఈ భోగిమంటల్లో ఈ రాక్షస ప్రభుత్వం జారీచేసిన జీవోలను తగలబెట్టాం. రానున్న రోజుల్లో టిడిపి జనసేన ప్రభుత్వం రావటం తథ్యం. కన్నా మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుంది. 98 శాతం హాబీలను నెరవేర్చామని చెప్పుకుంటున్న మోసగాళ్లు 85% హామీలు నెరవేర్చకపోగా రాష్ట్ర ప్రజల మీద మోయలేని భారాలు మోపాడు. ఆర్టీసీ చార్జీలు కరెంట్ బిల్లులు చెత్త పన్ను కూడా వేసి నిత్యవసర వస్తువులు మోయలేనంత బరువు వేశాడు. దొంగల ముఠా చేసే పనులు ప్రశ్నించిన వారి మీద పోలీస్ కేసులు పెడుతున్నారు. ఆఖరికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబునాయుడు కూడా 54 రోజులు జైల్లో పెట్టారు. ఈ సంక్రాంతితో చెడు రోజులపై మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాను. పట్టణంలో ఒక గ్రామీణ వాతావరణం ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావు, రూరల్ మండల అధ్యక్షుడు నాదెండ్ల నాగేశ్వరరావు, ఏడవ వార్డు కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, ప్రచార కమిటీ మెంబర్ బత్తుల కేశవ, టీడీపీ నాయకులు. డాక్టర్. వడ్డెం నవీన్, చౌట శ్రీనివాసరావు, ఆతుకూరినాగేశ్వరావు, గంధం కోటేశ్వరావు, కంబాల వెంకటేశ్వర్లు, జనసేన పార్టీ వీర మహిళ గట్టు శ్రీదేవి, జిల్లా ఎస్సీ నాయకులు చిలకా పూర్ణ, మైనార్టీ నాయకులు షేక్ ఖాసిం, కడియం అంకమ్మరావు తదితరులు పాల్గొన్నారు.