ఇఫ్తార్ విందు వేడుకల్లో పాల్గొన్న బొర్రా

  • మతసామరస్యానికి మారుపేరు రంజాన్

సత్తెనపల్లి నియోజకవర్గం: రాజుపాలెం మండలం, రెడ్డిగూడెం ఇఫ్తార్ విందు వేడుకల్లో ముఖ్యఅతిథిగా బొర్రా వెంకట అప్పారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొర్రా మాట్లాడుతూ దేశంలో మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే రంజాన్ వేడుకల్లో భాగమైన ఇఫ్తార్ విందులో పాల్గొనడం తనకు ఎంతో గొప్ప అనుభూతిని కలిగించిందని సత్తెనపల్లి జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు బొర్రావెంకట అప్పారావు అన్నారు. ముస్లింల పవిత్ర పండుగ అయిన రంజాన్ మాసం సందర్భంగా రెడ్డిగూడెం మసీద్ నందు అత్యంత అట్టహాసంగా జరిగాయి. కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో ముస్లింల నమాజ్ తో పాటుగా ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో బొర్రా వెంకటప్పారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత పెద్దల ఆశీర్వచనాలు అందుకున్న బొర్రా. కార్యక్రమంలో బొర్రా వెంట జనసేన పార్టీ నాయకులు, మండలాధ్యక్షులు, కౌన్సిలర్, మండల కమిటీ సభ్యులు, గ్రామ అధ్యక్షులు, జనసైనికులు, వీరమహిళలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.