సీనియర్ జర్నలిస్ట్ కుటుంబానికి బొర్రా వెంకట అప్పారావు ఆర్థిక సహాయం..

సత్తెనపల్లి: జర్నలిజం వృత్తిలో నిబద్ధతగా పనిచేసి విధి వంచితుడై పెరాలసిస్ తో బాధపడుతున్న సీనియర్ జర్నలిస్టుకు జనసేన పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు అండగా నిలిచారు. సత్తెనపల్లి పట్టణంలోని సీనియర్ జర్నలిస్ట్ చేవూరి చందు వివిధ పత్రికలు, చానల్ ద్వారా జర్నలిస్టుగా అందరికీ సుపరిచితుడే. అయితే ఇటీవల పెరాలసిస్ బారినపడి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని విషయాన్ని కార్యకర్తలు ద్వారా తెలుసుకున్న సత్తెనపల్లి జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు, బొర్రా వెంకట అప్పారావు చందు స్వగృహానికి వెళ్లి ఆయన్ని పరామర్శించి, వైద్యానికి సంబంధించిన రిపోర్టలను పరిశీలించి పలు సలహాలు సూచనలు అందజేశారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ విజన్ గ్రూప్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున 10000 (పది వేలురూపాయలు) ఆర్థిక సహాయం అందజేసి, చందు కుటుంబానికి తాను ఎప్పుడు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. చిన్నస్థాయి జీతభత్యాలు కలిగిన జర్నలిస్ట్ కుటుంబానికి నేడు ఆర్థికంగా అండగా సత్తెనపల్లి జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు నిలబడ్డారు.