శ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారి తిరునాళ్లలో పాల్గొన్న బొర్రా వెంకట అప్పారావు

సత్తెనపల్లి నియోజకవర్గం, రెంటపాళ్ళ గ్రామంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారి తిరునాళ్ల మహోత్సవానికి గ్రామ జనసైనికుల ఆహ్వానం మేరకు గ్రామానికి విచ్చేసి స్వామివారి యొక్క ప్రత్యేక పూజలలో బొర్రా వెంకట అప్పారావు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకొని అన్నదానం కార్యక్రమం బొర్రా వెంకట అప్పారావు వారి చేతుల మీదగా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగినది. అన్నదాన కార్యక్రమానికి రూపాయలు 100003/- బొర్రా వెంకట అప్పారావు అన్నదాన కార్యక్రమానికి విరాళం ఇవ్వడం జరిగినది. అనంతరం గ్రామస్తులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభను సందర్శించి గ్రామ జనసేన పార్టీ నాయకులు బొర్రా వెంకట అప్పారావుని శాలువాతో ఎంతో ఘనంగా సత్కరించడం జరిగినది. తదుపరి గ్రామంలో పలువురు సీనియర్ నాయకులను బత్తుల శివ తీర్థల శివ పలువురు నాయకులు బొర్రా సమక్షంలో జనసేన పార్టీ కండవు బొర్రా చేతుల మీదుగా కప్పించుకొని పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నాలుగు మండలాల అధ్యక్షులు కౌన్సిలర్ మండల కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, గ్రామ అధ్యక్షులు, గ్రామ జనసైనికులు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.