ఇంటింటికి జనసేన కార్యక్రమాన్ని ప్రారంభించిన బొర్రా వెంకట అప్పారావు

సత్తెనపల్లి నియోజకవర్గం, నకరికల్లు మండలం, కుంకలగుంట గ్రామంలో జనసేన పార్టీ సిద్ధాంతాలను, జనసేనాని ఆసయాలను ప్రజలకు తెలియజేయడం కోసం పల్లెగ్రామాలలో ఇంటింటికి జనసేన అనే కార్యక్రమాన్ని సత్తెనపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బొర్రా వెంకట అప్పారావు ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగినది. కార్యక్రమంలో బాగంగా.. భాగంగా సోమవారం కుంకలగుంట గ్రామంలో మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కుంకలగుంట గ్రామంలోని ఎస్సీ కాలనీలో బొర్రా వెంకటఅప్పారావు గారి చేతులమీదుగా జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆవిష్కరించడం జరిగినది. ఈ సందర్భంగా బొర్రా వెంకట అప్పారావు మాట్లాడుతూ జనసేన పార్టీ అనేది ఒక కులానికొ ఒక మతానికో చెందింది కాదు అని చాటి చెప్పడానికి ఈరోజు ఈ కుంకలగుంట గ్రామంలో ఎస్సీ కాలనీలో జెండా ఆవిష్కరణనే ఒక ఉదాహరణ అని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పార్టీలో కాపులే కాదు అన్ని కులాలు కూడా ఐక్యమత్యంతో కలిసి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చేసే దిశగా అడుగులు వేయాలని, శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాలని తన మాటని ప్రతి ఒక్కరం గౌరవించి తన అడుగుజాడల్లో మనందరం కలిసి మెలిసి గ్రామ గ్రామాల్లో పార్టీ అభివృద్ధి చందేలా అందరూ కలిసికట్టుగా సమిష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఎస్సీ కాలనీలో జనసేన పార్టీ ఎస్సీ నాయకులతో కలిసి ప్రజలతో మమేకమవుతు వారి యొక్క ఇబ్బందులు కష్టాలను తెలుసుకుంటూ గత ప్రభుత్వం హామీలు ఏవైతే ఇచ్చినో ప్రజలను మోసం చేసి అధికారులకు వచ్చిందో వచ్చిన తర్వాత ప్రజలను ఎలా హింసిస్తుందో అడుగుతూ తెలుసుకుంటూ ప్రభుత్వం యొక్క అన్యాయాన్ని అరికడుతూ ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి జనసేన అనే కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నాలుగు మండలాధ్యక్షులు కౌన్సిలర్ ప్రోగ్రాం కమిటీ నెంబర్స్ మండల వైస్ ప్రెసిడెంట్ మండల కమిటీ సభ్యులు గ్రామ కమిటీ అధ్యక్షులు గ్రామ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున జనసైనికులు వీర మహిళలు పాల్గొనడం జరిగినది.