సంక్షేమ ప్రభుత్వం ఏర్పడాలనే లక్ష్యంతో ఇరు పార్టీలు పని చేస్తాయి

భీమవరం: ప.గో జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కోటికలపూడి గోవింద రావు(చినబాబు) కు జనసేన-టీడీపీ సమన్వయ కమిటీలో సభ్యుడిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నియమించిన సందర్భంగా భీమవరం నియోజకవర్గ జనసేన ఎంపీటీసీ సభ్యులు కలిసి అభినందనలు తెలియజేశారు. ఇదేవిధంగా జిల్లా నుండి ఎన్నిక అయిన నరసాపురం నియోజకవర్గ ఇంచార్జ్ బొమ్మిడి నాయకర్ కు కూడా అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా చినబాబు మాట్లాడుతూ వచ్చే 2024 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధితో కూడిన సంక్షేమ ప్రభుత్వం ఏర్పడాలనే లక్ష్యంతో ఇరు పార్టీ లు సమన్వయంతో పని చేస్తాయని, అలాగే జిల్లాలో 15 సీట్లలో ఒక్క సీట్ కూడా వైసీపీ గెలవకూడదని, 15 కి 15 సీట్లు రెండు పార్టీల కూటమి మాత్రమే గెలవాలని అందుకు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు మీరంతా కలసి కట్టుగా పని చేసి అధ్యక్షుల వారికి బహుమతిగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో అభివృద్ధికి స్థానిక సంస్థల ద్వారా మీరంతా కృషి చెయ్యాలని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అవినీతి ప్రతి ఇంటికి తీసుకుని వెళ్లాలని వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ప్రజలకి భరోసా కల్పించాలని ఆయన అన్నారు. కలసిన వారిలో ఎంపీటీసీలు ఆరేటి వాసు, తాతపూడి రాంబాబు, విజయలక్ష్మి, ఇందిరా, ఆదిలక్ష్మి తదితరులు ఉన్నారు.