మహతి న్యూస్ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన బొటుకు రమేష్

నియోజక వర్గం: ప్రకాశం జిల్లా, దర్శి పట్టణంలోని జనసేన కార్యాలయంలో మహతి న్యూస్ ఛానల్‌ నూతన సంవత్సర క్యాలెండర్‌ను దర్శి నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్‌ బొటుకు రమేష్‌బాబు శనివారం ఆవిష్కరించారు. అనంతరం మహతి న్యూస్ ఛానల్‌ మేనేజింగ్ డైరెక్టర్ ముత్తుకూరి చిరంజీవిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బొటుకు రమేష్‌బాబు మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ మహతి న్యూస్‌ నిష్పక్షపాతంగా వ్యవహరించడం అభినందనీయమన్నారు. వాస్తవాలను ప్రజలకు చేరే వేసే మీడియా మాధ్యమాలకు ప్రజల ఆదరణ తప్పకుండా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి చిరంజీవి, ప్రకాశం జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు మరియు వార్డ్ సభ్యులు దర్శి పట్టణం అధ్యక్షులు చాతరాసి కొండయ్య, ముండ్లమూరు మండల అధ్యక్షుడు తోట రామారావు, కురిచేడు మండలం అధ్యక్షులు మాదా వెంకట శేషయ్య, దొనకొండ మండల అధ్యక్షులు గుండాల ప్రసాద్, దర్శి మండల నాయకులు పుపాలా పాపారావు, మహిళా నాయకురాలు పట్టణ ఉపాధ్యక్షులు గుండ్ల భారతి, పట్టణ ఉపాధ్యక్షులు ఎస్ కే భాష, దర్శి మండల కార్యదర్శి ఉప్పు అంజి, దర్శి మండల కార్యదర్శి అంకిరెడ్డి, కురిచేడు మండల ఉపాధ్యక్షులు మంచాల నరసింహారావు, ముండ్లమూరు మండల ఉపాధ్యక్షులు వీరాంజనేయులు, దర్శి మండల కమిటీ ప్రధాన కార్యదర్శి కత్తి నాగయ్య, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.