యువ క్రీడాకారులకు బాక్సర్ మల్లిక ఆదర్శం: డాక్టర్ కందుల నాగరాజు

విశాఖ దక్షిణ నియోజకవర్గం: విశాఖలో ప్రతిభగల క్రీడాకారులకు కొదవలేదని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. విశాఖకు చెందిన ఎంతో మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి, ప్రపంచ స్థాయి క్రీడలలో పాల్గొంటూ పథకాలు సాధిస్తున్నారని కొనియాడారు. ఆ కోవకు చెందిన బాక్సర్
ఎస్.జి.జే.ఎస్. మల్లిక తన ప్రతిభ పాటవాలతో మంచి గుర్తింపు తెచ్చుకుందని ప్రశంసించారు. సోమవారం అల్లిపురంలోని తన కార్యాలయంలో ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ మల్లిక సౌత్ వెస్ట్ జోన్ చండీగఢ్ యూనివర్సిటీ లో సిల్వర్ మెడల్ సాధించడం గొప్ప విషయమని చెప్పారు. 50-52 కిలోల విభాగంలో పంజాబ్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ లో జరిగిన అల్ ఇండియా యూనివర్సిటీ పోటీలలో సిల్వర్ మెడల్ సాధించడం జరిగిందన్నారు. అలాగే డామన్ అండ్ డయూ లో జరిగిన బీచ్ గేమ్ నేషనల్స్ గుజరాత్ లో బంగారు పథకం సాధించిందని కొనియాడారు. వారి ల్ గురువు ద్రోణాచార్య అవార్డ్ గ్రహీత ఐ.వెంకటేశ్వర రావు, సాయి కోచ్ ఎం. దుర్గారావు ప్రోత్సాహంతో ఆమె బాక్సింగ్ పోటీలలో అద్భుత ప్రతిభను ప్రదర్శిస్తూ పలు అవార్డు అవార్డులను సాధించడం జరిగిందని అన్నారు. ఆమె తల్లిదండ్రులు జానకి, మల్లేష్ లకు కూడా అభినందనలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.