బాయ్ ఫ్రెండ్ వేధించాడు.. జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు..!

ఇతర ఇండస్ట్రీల నుంచి జాన్వీ కపూర్ కు ఆఫర్లు వస్తున్నా ఆచితూచి జాన్వీ కపూర్ సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారు. శ్రీదేవి నటిగా అన్ని భాషల్లో గుర్తింపును సంపాదించుకోగా జాన్వీ కూడా భవిష్యత్తులో ఇతర భాషల్లో నటించే అవకాశాలు ఉన్నాయి.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జాన్వీ కపూర్ తరచూ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ తన ఫాలోవర్లను పెంచుకుంటున్నారు. సాధారణంగా స్టార్ హీరోలు, హీరోయిన్ల కొడుకులు, కూతుళ్లు తమ జీవితంలో చేదు అనుభవాల గురించి రిలేషన్స్, ఎఫైర్స్ గురించి పబ్లిక్ గా చెప్పుకోరు. అయితే జాన్వీ కపూర్ మాత్రం తన జీవితంలోని చేదు అనుభవం గురించి ఆమె అభిమానులతో పంచుకున్నారు.

బాయ్ ఫ్రెండ్ తో తాను డేటింగ్ కు వెళ్లానని ఆ సమయంలో ఊహించని ఘటన చోటు చేసుకుందని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చారు.బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ కు వెళ్లిన సమయంలో బాయ్ ఫ్రెండ్ తప్పుడు ప్రపోజల్స్ చేశాడని.తనను వేధింపులకు గురి చేశాడని అన్నారు.

ఆ ఘటనతో తాను లైఫ్ లో మళ్లీ అలాంటి తప్పు చేయకూడదని నిర్ణయం తీసుకున్నానని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చారు. జాన్వీ సినిమాల్లోకి రాకముందు ఈ ఘటన చోటు చేసుకుంది. లాస్ ఏంజిల్స్ లో జాన్వీ కపూర్ చదువుకునే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని సమాచారం.

ప్రస్తుతం జాన్వీ కపూర్ చాక్లెట్‌ బాయ్‌ కార్తీక్‌ ఆర్యన్‌ తో డేటింగ్ లో ఉన్నారు. ఈ మధ్య కాలంలో జాన్వీ, కార్తీక్ ఎక్కువగా కలిసి కనిపిస్తున్నారు.ప్రస్తుతం గుడ్ లక్ జెర్రీ సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తున్నారు.