బీపీ మండల్ 105వ జయంతి వేడుకలు

తాడేపల్లిగూడెం: ఒబీసిల ఆరాధ్యుడు బీపి మండల్ 105 జయంతి సందర్భంగా స్ధానిక బీసీ సంక్షేమ సంఘం ఆఫీస్ వద్ద నియోజక వర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశవబట్ల విజయ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వేడుకలకు జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వర్తనపల్లి కాశీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేశవబట్ల విజయ్ మాట్లాడుతూ వందల సంవత్సరాలుగా బానిసలలా బ్రతికిన బీసీలకు దాస్య విముక్తి చేసిన మహోన్నతుడు బీపీ మండల్ అని నేడు ఆత్మ గౌరవంతో రాజ్యాధికార దిశగా బీసీలు ప్రయత్నిస్తున్నారు అంటే అందుకు మార్గదర్శకులు బీపీ మండల్ అని, అతని జీవితం ఆకరివరకు కూడా బీసీల అభ్యునతికి కృషిచేసిన విలువలు కలిగిన సాంఘ సంస్కర్త బీపీ మండల్ అని ఆయన కోరిన 40 సిఫార్సులు అమలు అయ్యేవరకు బీసీల ఉద్యమం కొనసాగుతుందని అని అన్నారు. వర్తనపల్లి కాశీ మాట్లాడుతూ దేశ జనాభాలో అధికశాతం ఉన్న బీసీలకు ఆత్మగౌరవాన్ని కల్పించి బీసీలు కేవలం ఓటర్లు కాదు ఈ దేశ పాలకులు అని దేశానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. విలువలు కోసం, నితి కోసం పదవిని సైతం వదులు కున్న గొప్ప నాయకుడు అని, బీసీలు ఓట్లతో గద్దెనెక్కిన ప్రజా ప్రతినిధులు బీపీ మండల్ ని ఆదర్శంగా తీసుకొని బీసీల రిజర్వేషన్ కి తోడ్పడాలి అని, స్వాతంత్రం వచ్చి 75 సవంత్యారాలు గడిచిన ఇప్పటికీ కూడా బీపీ మండల్ సిఫార్సు చేసిన 40 సిఫార్సులలో కేవలం ఒకే సిఫార్సు అమలుచేస్తున్నారు అంటే ఈ దేశ పాలకులకి ఎలాంటి చిత్త శుద్ది ఉందో అర్థం చేసుకోలేని స్థితిలో బీసీలు లేరు అని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజక వర్గ ప్రధానకార్యదర్శి తుమరాడ చిన్న, జిల్లా ఉపాధ్యక్షులు మారిసేట్టి నరసింహ మూర్తి, నియోజక వర్గ కార్యదర్శి లక్ష్మణ్, సీనియర్ బీసీ నాయకులు పేదిరెడ్ల సతీష్, లీగల్ సెల్ కన్వీనర్ మూర్తి, వాక నాని, రాఘవేంద్ర, తదితర బీసీ నాయకులు పాల్గోన్నారు.