దివాకర్ కుటుంబానికి అండగా నిలచిన బ్రహ్మసముద్రం పబ్లిక్ వాయిస్

కళ్యాణదుర్గం: ఆటో ప్రమాదంలో చనిపోయిన వేపులపర్తి గ్రామానికి చెందిన దివాకర్ కుటుంబానికి బ్రహ్మసముద్రం మండలంలోని అన్ని వర్గాల ప్రజలు సహాయంగా ఇచ్చిన డబ్బు 15,000 మొత్తాన్ని దివాకర్ కుటుంబ సభ్యులు దివాకర్ భార్య, పిల్లలకు “బ్రహ్మసముద్రం మండల ప్రజలు” తరఫున, “బ్రహ్మసముద్రం పబ్లిక్ వాయిస్” ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రహ్మసముద్రం మండల జీడీపీటీసీ ప్రభావతమ్మ, మీసేవ సెంటర్ నిర్వాహకుడు బ్రహ్మసముద్రం ఏసేపు, ఐటీడీపీ బ్రహ్మసముద్రం మండల కోఆర్డినేటర్ లోకేష్, జనసేన పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గం మీడియా ఇంచార్జ్ బ్రహ్మసముద్రం రాయుడు, బ్రహ్మసముద్రం విల్సన్, ఎం ఆర్ పి ఎస్ చెలిమేపల్లి మారెప్ప, వేపులపర్తి గ్రామస్తులు పాల్గొన్నారు.