ఘనంగా శ్రీ వీరభద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాలు

అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలో శ్రీ వీరభద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా రాజంపేట నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీ వీరభద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా జరిగే తిరుణాలకు స్థానికులు రాయచోటి పట్టణం మరియు గ్రామీణ ప్రాంతాలతో పాటుగా వివిధ ప్రాంతాల వారు పలు రాష్ట్రాల నుండి ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం నుంచి నిరంతరం స్వామి వారి భక్తాదులు తరుచుగా వేలాది మంది వస్తుంటారనే విషయం తెలుసుకున్న ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారుల ద్వారా ప్రజలందరికీ ఎటువంటి పరిస్థిలో సమస్యలకు మరియు అసౌకర్యానికి చోటు లేకుండా తగిన ఏర్పాట్లు చేశారంటూ ఆనందోత్సాహాలతో స్వామి వారిని ప్రశాంతంగా దర్శనం చేసుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment