విశ్వేశ్వరాయపురం వంతెన కల్వర్ట్ నిర్మాణ పనులను గౌరవ శాసన సభ్యులు దేవ వరప్రసాద్ బుధవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి త్వరలో ఈ వంతెనను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ వంతెన పూర్తయితే ఎప్పటి నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానిక గ్రామాల ప్రజలకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడుతుందని, వారి కష్టాలు తీరుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడే ఈ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేసేలా సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
Share this content:
Post Comment