జనసేనాని సిద్ధాంతాలను, ఆశయాలను సామాన్య ప్రజల చెంతకు చేర్చటమే నిజమైన బహుమానం: డా.మాధవ రెడ్డి

శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 2, శనివారం రోజున శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జి డా. మాధవ రెడ్డి ఆధ్వర్యంలో జనసేన అధినేత, ప్రజా నాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మ దినాన్ని శేరిలింగంపల్లి నియోజక వర్గంలో జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, రేపటి తరాన్ని అందించే విద్యార్థులు, సామాన్య ప్రజల మధ్య ఘనంగా నిర్వహించుకోవటం జరిగింది. ముందుగా పవన్ కళ్యాణ్ ఆరాధ్యదైవం జగన్మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించటం జరిగింది. అదేవిధంగా జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేసి, రక్తదాన శిబిరం నిర్వహించి రక్తదానం చేయటం జరిగింది. అనంతరం నేటి బాలలే – రేపటి పౌరులు అనే నానుడిని విశ్వసించే జనసేన పార్టీ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు కావల్సిన పుస్తకాలు, పెన్నులను, జామెట్రీ బాక్స్ లను, వివిధ రకాల పండ్లను పంచటం జరిగింది. తదనంతరం అన్నదానం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజవర్గ ఇంచార్జ్ డా.మాధవ రెడ్డి మాట్లాడుతూ మనందరికి పవన్ కళ్యాణ్ జన్మదినం మనకు పండుగ రోజు అని, ఈ రోజు మనం నిర్వహించుకున్న సేవా కార్యక్రమాలన్నీ జనసేన పార్టీ భావజాలం నుండి పుట్టినవే అని, అంతేకాకుండా, రానున్న రోజుల్లో జనసేన పార్టీ భావజాలాన్ని, ఆశయాలను, సిద్ధాంతాలను
ప్రతి ఒక్క యువతీ యువకుడి వద్దకు చేర్చాలని, పవన్ కళ్యాణ్ ఎంతో విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపటానికి, కులాంతరాలు లేని, మత విద్వేషాలు లేని సమాజాన్ని నిర్మాణం చేయటానికి ప్రయత్నిస్తున్నారని, ఆయన ఆశయాలకు తగ్గట్లుగా, సాధారణ పవన్ కళ్యాణ్ అభిమానులను జనసేన కార్యకర్తలుగా తీర్చే ప్రయత్నం చేయాలన్నారు. అందులో భాగంగానే రానున్న రోజుల్లో మార్పుకోసం జనసేన పేరుతో శేరిలింగంపల్లి నియోజకవర్గం అంతా పాదయాత్ర చేయటానికి, మీలో ఒక్కడిగా, మీ ఇంటివాడిగా, పవన్ కళ్యాణ్ భావజాలాన్ని చెప్పటానికి మీ ముందుకు వస్తున్నానని, పెద్ద మనసుతో ఆశీర్వదించి, మీలో ఒక్కడిని, మార్పు కోసం పనిచేసే సేవకుడిగా ప్రజలతో ఉంటూ, ప్రజల కోసం, పనిచేసే ప్రజాసేవకుడిగా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాదారం రాజలింగం, రవి, హనుమంత్ నాయక్, హరి నాయక్, బి.అరుణ్ కుమార్, మల్లేష్ ముదిరాజ్, శ్రవణ్ కుమార్, ప్రవీణ్, శ్రీకాంత్, మహాలక్ష్మి, శ్రీలక్ష్మి, రమేష్, లక్ష్మీనారాయణ, సేవ్య ,సాజిత్, చిరంజీవి, నరేష్ మరియు ఇతర జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.