ఏపీలో బ్రిటిష్ పాలన

  • చీకటి జీవో 1ని రద్దు చేయాలని మోకాళ్ళపై నిరసన

అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి.సుండుపల్లి మండల కేంద్రంలో వామపక్షాల డిమాండ్. ఏపీలో బ్రిటిష్ పాలన సాగుతోందని, చీకటి జీవో 1ను రద్దు చేయాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం సుండుపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలి వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ర్యాలీగా తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లి తాసిల్దార్ కార్యాలయం ఎదుట మోకాళ్ళ మీద నిరసన తెలియజేశారు. జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక అవకాశం కోరి నేను ఉన్నాను, నేను విన్నాను అని అత్యధిక సంఖ్యలో ప్రజా మద్దతు తీసుకుని అధికారాన్ని అడ్డుపెట్టుకుని పరిపాలన కేవలం తన వర్గానికి వ్యక్తిగత స్వార్ధ ప్రయోజనాలకు రాజకీయ లబ్ధికోసమే లక్షలాది కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రజలకు ఉపయోగంలేని సంక్షేమ పథకాలు,అప్రజాస్వామికంగా చీకటి జీవోలు అమలు చేస్తున్న వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ భారత రాజ్యాంగ విలువలన కాలరాస్తూ తమ సైకో జీవోలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొస్తున్నారని రాబోయే ఎన్నికల్లో ప్రజలందరి మద్దతు కూడగట్టుకొని మా అధినాయకుడు జనసేనాని వాస్తున్నారు మిమ్మల్ని తాడేపల్లి నుంచి ఇంటికి పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఇప్పటికైనా మంచి బుద్ధి తెచ్చుకుని ప్రజా అవసరాలకు ఉపయోగపడే విదంగా మీ యొక్క పరిపాలన యంత్రాంగం ఉండాలని జనసేన తరపున డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు విశ్వనాథ నాయక్ మరియు తెలుగుదేశం, బిజెపి, జనసేన, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఖూని అవుతోందని తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా సమావేశాలు, ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించకుండా జీవోలను తెచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. 175 కు 175 స్థానాలు మనవి అని చెప్పుకున్న ముఖ్యమంత్రి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రజా సంఘాలు ప్రతిపక్షాలు వామపక్షాలు బహిరంగం చేసే ప్రజలకు తెలియజేస్తున్నాయి కాబట్టే, కేవలం బహిరంగ సభలను ర్యాలీలను అడ్డుకోవడం హాస్యాస్పదంగా ఉందని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు జీవో నెంబర్ ఒకటిని తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు. ప్రజా వ్యతిరేక పాలన ఏపీలో త్వరలో ముగిస్తుందని ధ్వజమెత్తారు. ఆ రోజుల్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆనాడు ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి. పాదయాత్రలకు ఆనాడు పాలకపక్షాలు అడ్డుకొని ఉండి అలాంటి చీకటి జీవోలు తీసుకొని వచ్చి ఉంటే ఈరోజు ముఖ్యమంత్రులుగా కొనసాగే వారేనా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకొని తప్పులను ఒప్పుకొని ఇప్పటికైనా జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరో మారు వైకాపా అధికారంలోకి వస్తే పీల్చేగాలి నడిచే రోడ్డును సైతం నిర్బంధించే పరిస్థితులు వస్తాయని రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాలేపాటి శివరాం నాయుడు చంద్రశేఖర్ రాజు, సురేష్ కుమార్ నాయుడు, మాజీ ఎంపీటీసీ మోహన్ బాబు నాయుడు, బిజెపి నాయకులు జగదీష్, వెంకట్రామరాజు, వెంకట్రామరాజు, జనసేన నాయకులు రెడ్డి రాణి, రాజా, సలీం, మహాజన సోషలిస్ట్ పార్టీ నాయకులు పల్లం నాగేంద్ర నాగరాజా, ఎమ్మార్పీఎస్ నాయకులు మహదేవ రైతు సంఘం నాయకులు సుబ్బరామరాజు, మాల మహానాడు నాయకులు గాలి ప్రతాప్, వడ్డెర సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు డేరంగుల వెంకటేష్, ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య మండల కార్యదర్శి మల్లికార్జున నాయక్, అఖిల భారత విద్యార్థి సమాఖ్య మండల కార్యదర్శి ఆసిఫ్, ఆంధ్రప్రదేశ్ యువజన సమాఖ్య నాయకులు నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.