దేవీపట్నం మండలంలో పుంజుకుంటున్న దళారి వ్యవస్థ

రంపచోడవరం: పోలవరం ముంపు ప్రాంతాల్లో ప్రధాన మండలం దేవిపట్నం కాగా పూర్తి స్థాయిలో 44 గ్రామాల్లో ఎవక్క గ్రామానికి నష్టపరిహారం పునరవసాలు పూర్తి కాలేదు. అయితే మూలపాడు గ్రామంలో గల రైతులకు కొంతమందికి భూమికి ఆన్లైన్ అవ్వనికారణంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లగా 18 మందికి సంబంధించిన లిస్ట్ ను వి.ఆర్.ఓ ద్వారా వాలంటీర్ లకు సమాచారం ఇవ్వగా రైతులదగ్గరకు వచ్చి ఆధారాలు తీసుకోవటం జరిగింది. అయితే దీన్ని అదునుగా తీసుకున్న వైసీపీ అధికారపార్టీ నాయకుడు అమాయక గిరిజన మూలపాడు రైతులదగ్గరకు వెళ్లి ఆన్లైన్ చేయించడానికి ఎకరానికి 20,000/-(ఇరువైవేలు)అవుతుందని పాడేరు వెళ్లి చేయించాలి అని దేవిపట్నం మండల అధికారుల పేరును వాడుకుంటూ రైతులను ఏమార్చే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ మండల అధ్యక్షుడు చారపు వెంకరాయుడు రైతుల దగ్గరకు వెళ్లి వివరంగా తెలుసుకుని, అది అంత తప్పుడు సమాచారం అని ఎవరికి రూపాయి కట్టక్కర్లేద్దు అని పైగా తహశీల్దార్ అలాంటి కోవర్టులను ఎంకరేజ్ చెయ్యరు అని ఆయనకు తెలియకుండా పేరు వాడుకుని సొమ్ము చేసుకునే ప్రయత్నం జరుగుతుందని చెప్పి రైతుల్ని తహశీల్దార్ గారి వద్దకు తీసుకు వెళ్లి జరిగిన విషయాన్ని వివరించగా, తహశీల్దార్ గారు మాట్లాడుతూ ఇలాంటి తప్పుడు దళారులకు రూపాయి చెల్లించనవసరం తప్పుడు వ్యక్తులను నేను ఉపేక్షించేదిలేదు అవసరం అయితే ఆయన పేరు వాడిన వారిపై అధికారకంగా చర్యలు తూసుకుంటానని జైలుకు పంపిస్తానని మీరు కంగారు పడవద్దని రైతులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యకరంలో రాయుడుతో పాటు ఆదివాసీ నాయకులు రాము గ్రామ రైతులు పాల్గొన్నారు.