గజపతినగరం, కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు లక్షల కోట్లతో బడ్జెట్ సంతృప్తికరంగా ఉందని జనసేన జిల్లా సీనియర్ నాయకులు & ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కొప్పుల వెలమ వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డా.రవి కుమార్ మిడతాన ప్రశంసించారు. గత వైసీపీ ప్రభుత్వ బడ్జెట్ కొందరికి మాత్రమే లాభదాయకమైనదిగా ఉండేదన్నారు. వ్యవసాయరంగానికి పెద్దపీట వేశారన్నారు. సంక్షేమం, అభివృద్ధికి బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇచ్చారన్నారు. ప్రధానంగా అధికారంలోకొచ్చేందుకు దోహదపడ్డ సూపర్ సిక్స్ పథకాలకు ఈ బడ్జెట్‌లో కేటాయింపులు చేయడం అభినందనీయమన్నారు, అలాగే బీసీ వెల్ఫేర్ కు పెద్ద పీట వేశారు, కరువు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దేలా ఏపీ బడ్జెట్ కేటాయింపులు చేసారన్నారు. ఆర్థిక లోటు ఉన్నా కూడా సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పోలవరం, అమరావతికి భారీ కేటాయింపులు చేయడం హర్షణీయమన్నారు.
Share this content:
Post Comment