రాజోలు మండల పరిషత్ కార్యాలయంలో గురువారం జరిగిన బడ్జెట్ మీటింగ్‌లో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పాల్గొనడం జరిగింది. అనంతరం, స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశమై గ్రామ స్థాయిలో ప్రధానమైన మంచినీటి ఎద్దడి, డ్రైనేజీ సమస్యలు, రోడ్లు, కరెంటు సమస్యలు, పారిశుద్యం, డంపింగ్ యార్డులు, స్మశాన వాటికలు, ఉపాధికల్పన వంటి ఆరు ప్రధాన సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. తర్వాత ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి సంబంధిత అధికారులకు అప్పగించి వాటిని త్వరగా పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో మండల అధ్యక్షుడు, జెడ్పిటిసి, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎమ్మార్వో, విఆర్వోలు, ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శులు, సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్, నీటిసరఫరా, ఇరిగేషన్, డ్రైనేజీ, పిఆర్, ఆర్&బి, ఎపిఈపీడీసిల్ ఇంజినీర్లు, ఉపాధి హామీ ఏపీవో, ఫీల్డ్ అసిస్టెంట్లు, డ్వాక్రా ఎపిఎం, యానిమేటర్లు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment