కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై గుంతకల్ నియోజవర్గం జనసేన పార్టీ సమన్వయబాధ్యుడు వాసగిరి మణికంఠ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ సంక్షేమం, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ఉంది. అందుకు అనుగుణంగా కేటాయింపులు ఉన్నాయి. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేసింది. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు తగ్గించే చర్యలు చేపట్టింది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పంచాయతీరాజ్ శాఖకు పెద్ద ఎత్తున నిధులను, అన్నదాత సుఖీభవ, పేదలకు ఆరోగ్య బీమా, పింఛన్ల పెంపుదల, దీపం 2 పథకాలకు నిధుల కేటాయింపుతోపాటు మిగిలిన సూపర్ సిక్స్ పథకాల హామీలను తప్పకుండా నెరవేరుస్తామని బడ్జెట్ కేటాయింపుల ద్వారా నిరూకున్నామన్నారు. ‘తల్లికి వందనం’ పథకాన్ని ఈ ఏడాది మే నుంచి అమలు చేసేందుకు రూ.9,407 కోట్లను కేటాయించారు, అన్నదాతలకు భరోసానిచ్చేలా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ రూపొందించిన ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రైతాంగానికి మేలు చేసే బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆర్థిక, ప్రణాళిక, వ్యవసాయ శాఖల అధికారులకు ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Share this content:
Post Comment