పేద ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్: ఉప్పు వెంకటరత్తయ్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల సమక్షంలో ఆర్థిక మంత్రి పయావుల కేశవ్ అసెంబ్లీ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఆనందదాయకమైనదని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టి ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య అన్నారు. ప్రజలు ఎప్పటినుంచో ఏదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి కోసం రెట్టింపు స్థాయిలో నిధులు మంజూరు చేసినారని అయన ఆశాభావం వ్యక్తంచేశారు. గత కోన్ని సంవత్సరాలగా రైతులు కోరుకుంటున్నట్లుగా గుంటూరు ఛానల్ భూసేకరణ కోసం, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంనకు, నధులు అనుసంధానం కోరకు నిధులు బడ్జెట్లో కేటాయించిన సందర్భంగా రైతులు, ప్రజలు అనందం వ్యక్తం చేస్తున్నారని వెంకటరత్తయ్య అన్నారు. పేద ప్రజల కోసం 25 లక్షలు ఆరోగ్య భీమా కు నిధులు బడ్జెట్లో మంజూరు చేయాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నిర్ణయించడం గత ప్రభుత్వానికి కంటే కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరికీ మరింత చేరువైనదని అయన తేలియజేశారు. గత ప్రభుత్వం అధికారాన్ని అనుభవించి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయి అభివృద్ధికి నోచుకోని విధంగా గత పాలకులు చేసారని ఉప్పు వెంకటరత్తయ్య అన్నారు .

Share this content:

Post Comment