సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు నియోజకవర్గం పార్టీ కార్యాలయం నందు బడ్జెట్ పై మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 2025 నుండి 2026 ఆర్థిక సంవత్సర బడ్జెట్ సంక్షేమం సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ఉంది. రెవెన్యూ లోటు ద్రవ్యలోటు తగ్గించే చర్యలు చేపట్టింది. ఈ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల భవిష్యత్తుకు భరోసానిచ్చేలా అభివృద్ధికి బాటలు వేసేదిగా ఉంది. మూలధన వ్యయాన్ని 40,636 కోట్లు పెంచడం ద్వారా మౌలిక వసతులు పెరుగుతాయి రాబడి పెంపుదలకు బాటలు వేసినట్లు అయింది. ప్రణాళిక బద్ధంగా రూపొందించిన బడ్జెట్ 3,22359. ఎన్నికలలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుకు బడ్జెట్లో తగిన కేటాయింపులు జరపడం కుటమీ ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం. దీపంతో పథకాలకు నిధుల కేటాయింపుతో పాటు మిగిలిన పథకాలను తప్పకుండా నెరవేరుస్తామని బడ్జెట్ కేటాయింపు. తల్లికి వందనం పథకానికి ఈ ఏడాది నేను నుంచి అమలు చేసేందుకు ₹9,407 కోట్లు. అన్నదాతలకు భరోసానిచ్చేలా ఏడాదికి 20,000 ప్రతి రైతుకి సహాయం అందుతుంది. సాగునీటి రంగానికి 18019 కోట్లు. పల్లెలు పట్టుకొమ్మలు అన్న మహాత్ముని వాక్కు అనుసరిస్తూ గ్రామీణ అభివృద్ధికి 18,990 కోట్లు. జల్జీవన్ మిషన్ పథకం ఎంతో ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం 2028 వరకు గడువు పొడిగించడం మన రాష్ట్రానికి ప్రయోజనకరమైన విషయం. ఆక్వారైతులకి విద్యుత్తు యూనిట్ 1.50 పైసలు చేయడం హర్షనీయం. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కి రైతాంగానికి మేలు చేసే బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చయ్య నాయుడుకి అభినందనలు.
Share this content:
Post Comment