వాటర్ ట్యాంక్ ను నిర్మించండి: దువ్వూరు జనసేన డిమాండ్

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి నలిశెట్టి శ్రీధర్ సూచనల మేరకు ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఉపాధ్యక్షులు దాడి భాను కిరణ్ ఆధ్వర్యంలో.. బుధవారం సంగం మండలంలోని దువ్వూరు గ్రామం నందు త్రాగు నీరు నిల్వ పరిచే సుమారు 3000 నుంచి 5000 లీటర్ల సామర్ధ్యం గల వాటర్ ట్యాంక్ ను నిర్మించాలని జనసేన పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.

త్రాగు నీరు నిల్వ చేసే వాటర్ ట్యాంక్ లేని కారణంగా.. గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం జనసేన పార్టీ దృష్టికి రావడం జరిగింది. కరెంటు ఉంటేనే మోటార్ల సాయంతో పంచాయతీ కుళాయిల ద్వారా త్రాగునీరు గ్రామ ప్రజలకు అందుతాయి.. అయితే ప్రస్తుతం ఉన్న ఈ వై.ఎస్.ఆర్.సి.పి ప్రభుత్వంలో కరెంటు కోతలు ఎక్కువగా ఉండడం వల్ల త్రాగు నీరు అందక చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ తాగునీరు సమస్య తీరాలంటే “త్రాగునీరు వాటర్ ట్యాంక్ “ను నిర్మించాలని ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది.

లేనిపక్షంలో ఈ సమస్యను తీర్చే దిశగా జనసేన పార్టీ ప్రజల తరఫున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని తెలియచేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో దువ్వూరు గ్రామం జనసేన పార్టీ ఆరవ వార్డు నెంబర్ ఆకులేటి సుధాకర్, సంఘం మండల నాయకులు మల్లికార్జున్, సతీష్, శ్రీకాంత్, లింకులు, మస్తాన్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.