రోడ్లు వేయండి ప్రజల ప్రాణాలు కాపాడండి

పాలకొండ జనసేన పార్టీ ఆధ్వర్యంలో గురువారం రోడ్లు వేయండి ప్రజల ప్రాణాలు కాపాడండి అనే నినాదంతో పాలకొండ నుంచి ఉంగరాడా మెట్ట వరకు పాదయాత్రను మొదలుపెట్టారు. అక్కడినుండి రాజాం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ఎన్ని రాజు ఆధ్వర్యంలో జరుగుతున్న మహా పాదయాత్రకు సంఘీభావంగా పాలకొండ నుండి జనసేన పార్టీ నాయకులు పాలకొండ నుంచి పాదయాత్రగా బయలుదేరి మహా పాదయాత్రలో కలిసి పాదయాత్ర కొనసాగించారు. మార్గమధ్యలో రోడ్డు గుంతలు ఎక్కువగా ఉండడం వల్ల ఒక ఆటో బోల్తా బోల్తా పడటం చూసి రక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. గత వారం రోజులు వ్యవధిలో చాలామంది ఈ రోడ్డు పాలిటపడి క్షతగాత్రులయ్యారు. మార్గమధ్యంలో కనబడుతున్న ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం తీరును ఎండ కట్టి తెలియజేయడం జరిగింది. ఈ పాదయాత్రలో పాలకొండ జనసేన పార్టీ నుండి ప్రశాంత్ పొరెడ్డి, పొట్నూర్ రమేష్ కడగల హరికృష్ణ వాసు శంకర్ అఖిల్ అప్పన్న తదితర జనసైనికులు పాల్గొన్నారు.