‘పుష్ప’ తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ కానున్న బన్ని

సుకుమార్‌ దర్శకత్వoలో నిర్మిస్తున్న ‘పుష్ప’  సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చేందుకు స్టార్‌హీరో స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ రెడీ అవుతున్నారు. అయితే డబ్బింగ్ సినిమాల ద్వారా బాలీవుడ్‌కు అల్లు అర్జున్‌ ఎపుడో దగ్గరయ్యారు. కానీ డైరెక్టుగా సిల్వర్‌స్క్రీన్‌పై పలకరించేందుకు సమయం కావాల్సి వచ్చింది…అల్లు అర్జున్‌కు అక్కడ క్రేజ్‌ ఉందని అందరికి తెలిసిన విషయమే. ఈ మధ్యకాలంలో బాలీవుడ్‌లో బన్నీ పేరు మరింతస్థాయిలో విన్పిస్తోంది… ‘పుష్ప’  ద్వారా బాలీవుడ్‌ప్రేక్షకులకు బన్ని మరింత దగ్గర కానున్నారు.