బన్నీ స్పెషల్ థ్యాంక్స్

అల్లు అర్జున్, స్నేహ తనయ అల్లు అర్హ అర్హ శనివారం నాలుగో పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. పుట్టినరోజు సందర్భంగా అర్హ పుట్టినరోజు వేడుకలను మైత్రీ మూవీ మేకర్స్‌ గ్రాండ్‌గా నిర్వహించారు. గుర్తుండిపోయే పార్టీని ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్‌ రవి గారు, నవీన్ గారు, చెర్రీ గారికి వ్యక్తిగతంగా అభినందనలు చెప్పాలనుకుంటున్నా. థ్యాంక్యు అని ట్వీట్‌ చేశారు. ఇక ఈ ఫొటొల్లో అల్లు అర్జున్, స్నేహ, అల్లు అయాన్‌లతో పాటు దర్శకుడు సుకుమార్ ఉన్నారు. ఆ ఫొటోలను అల్లు అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే అంజలి సినిమాలోని అంజలి అంజలి పాటను రీక్రియేట్‌ చేసి బన్నీ ఆమెకు గిఫ్ట్‌గా ఇచ్చారు.