ప్రజల తరపున ఉద్యమిస్తాం: బూరగడ్డ శ్రీకాంత్

గుడివాడ, శనివారం ఉదయం 11 గంటలకు జనసేన పార్టీ కార్యాలయంలో పత్రిక విలేకరుల సమావేశంలో గుడివాడ జనసేన పార్టీ ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్ మాట్లాడుతూ…

◆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పాలన అరాచక శక్తుల భూకబ్జాలకు పాల్పడుతుందని విమర్శించారు.
◆ గుడివాడ నియోజకవర్గంలో స్థానిక ప్రజలకు వైసీపీ నాయకుల ఆగడాలు ఎక్కువైపోయాయి అన్నారు.
◆ గుడివాడలో అభివృద్ధి గోరంత వైసీపీ నాయకుల అభివృద్ధి కొండంత జరుగుతుందని అన్నారు.
◆ గుడివాడ ప్రజల అభివృద్ధికి మాజీ మంత్రి ఎమ్మెల్యే కొడాలి నాని ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు.
◆ స్థానిక సమస్యలు నాలుగేళ్లుగా అలాగే ఉన్నాయని అన్నారు.
◆ విజయవాడ రోడ్డు అభివృద్ధి నత్తనడక సాగుతుందని నాలుగేళ్లుగా అభివృద్ధి చేయలేకపోయారని ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
◆ అలాగే ఫ్లైఓవర్ నిర్మాణం ఇంతవరకు మొదలు కాలేదు అన్నారు.
◆ జనసేన పార్టీ అనేక సమస్యల మీద అధికారుల దృష్టికి తీసుకువచ్చిన అధికారులు ముద్దు నిద్రపోతున్నారని అన్నారు.
◆ గుడివాడ పంపుల చెరువు అభివృద్ధి గురించి జనసేన పార్టీ తరఫున పోరాటం చేస్తే తమపై తప్పుడు కేసులు పెట్టారు అనిఅన్నారు.
◆ అలాగే గుడివాడ పట్టణంలో ప్రధాన రెండు పార్కులు అభివృద్ధి గురించి మున్సిపల్ కమిషనర్ కి వినతిపత్రం ఇస్తే పోలీసులతో తమ గొంతు నొక్కి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కావున ఇప్పటికైనా అధికారులు సమస్యల గురించి తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో ప్రజలతో కలిసి జనసేన పార్టీ ఉద్యమ రూపంలో గుడివాడ ప్రజలు తరఫున నిలబడి పోరాడుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మజ్జి శ్రీనివాసరావు, వేమూరి త్రినాథ్, సాయిన రాజేష్, ఆంజనేయులు, వైయస్సార్, సుంకర వెంకట్, విశ్వేశ్వర రావు, భాను, శివ తదితరులు పాల్గొన్నారు.