పాలన చేతకాక ప్రజలపై పన్ను రూపంలో భారమా…?: పొదిలి బాబురావు

ప్రస్తుత పరిస్థితుల్లో గత రెండు సంవత్సరాల నుంచి కరీనా బారిన పడి నగర ప్రజల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుంటుపడి పోయిన ఈ సమయంలో అభివృద్ధి ఏమాత్రం చేయని ఈ వైసీపీ ప్రభుత్వం నగరంలోని ప్రజల ఆస్తి పన్ను పై ఉక్కుపాదం మోపుతూ ప్రజల యొక్క క్షేమాన్ని గాలికి వదిలి వారి రక్త మాంసాలను అమ్మి మా ఖజానాకు డబ్బులు నింపమని పదేపదే ప్రజలపై మునిసిపాలిటీ అధికారులతో ఒత్తిడి తెస్తున్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ నగరంలో ఇంటి పన్ను కట్టని పక్షంలో తాగునీటి కనెక్షన్లు కట్ చేస్తామని ఇంటికి తాళం వేస్తామని నగరంలోని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ బెదిరింపులు చూస్తుంటే నిజంగానే రాష్ట్రంలో మహిషి పాలన జరుగుతుంది అనే విధంగా ఉన్నది. ఓవర్ బ్రిడ్జ్ వర్క్ వలన నగరానికి నడిబొడ్డున ఉన్న కమలా నగర్ మరియు సుభాష్ రోడ్ లోని వ్యాపార సంస్థలు పూర్తిగా చతికిలపడిన విషయం పాలకులకు కనిపించడం లేదా.? ఇదే విధంగా ప్రజలపై ఒత్తిడి తెస్తే ప్రజల పక్షాన నిలబడి మునిసిపాలిటీ వ్యవస్థను ముట్టడి చేయాల్సి వస్తుందని జనసేన పార్టీ. తరఫున హెచ్చరిస్తున్నామని పొదిలి బాబురావు అన్నారు.