మోటూరి దంపతుల ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వేసవికాలం సందర్భంగా, గత మూడు సంవత్సరాలుగా సోమవారం గ్రీవెన్స్‌కు వచ్చే అర్జీదారులందరికీ చిందాడగరువు ఎం.పి.టి.సి మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు దంపతులు ధన సహాయంతో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతోంది. అదే విధంగా, ఈ సంవత్సరం కూడా మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించబడింది. ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ, మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు దంపతులు చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నీ.శాంతి, డిఆర్ఓ మేడం విశ్వేశ్వరరావు, వివిధ అధికారులు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Share this content:

Post Comment