భక్తులకు మజ్జిగ పంపిణీ

ఇచ్చాపురం నియోజకవర్గం లొద్దపుట్టి గ్రామంలో ధనరాజ్ తులసమ్మ తల్లి ఆలయ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆదివారం లొద్దపుట్టి గ్రామ జనసైనికులు ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ఇచ్చాపురం నియోజవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి రాజు విచ్చేసి నడక దారిన పోయిన భక్తులకు మజ్జిగ పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తిప్పన సురేష్ రెడ్డి, మాధవ్, రోకళ్ళ భాస్కరరావు, ప్రేమ్ కుమార్, కలియగౌడ, గ్రామస్తులు జనసైనికులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment