విద్యార్థులకు మజ్జిగ పంపిణీ

సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కే.ఎస్.ఎన్. జెడ్.పిల్ హైస్కూల్ (కురువాడ సత్యనారాయణ ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల) వద్ద పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు మజ్జిగ పంపిణీ చేశారు. విద్యార్థులకు సహాయంగా నిలిచేందుకు, పరీక్షల సమయంలో హాయిగా ఉండేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనసేన పార్టీ యువతకు అండగా నిలిచి ప్రజా సమస్యలపై పోరాడుతుందని, ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. కురువాడ సత్యనారాయణ గారి దానస్వభావాన్ని కొనియాడుతూ, ఆయన సొంత నిధులతో పేద విద్యార్థుల కోసం ఈ పాఠశాలను నిర్మించారని గుర్తు చేశారు. అనేక మంది విద్యార్థులు ఇక్కడి నుంచి విద్యాభ్యాసం పూర్తి చేసుకొని దేశ విదేశాల్లో ఉన్నత స్థానాలను అధిరోహించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పినిశెట్టి మల్లికార్జున్, సందూరి శ్రీహరి, మణి, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment