By Election: అక్టోబ‌ర్ 30న హుజూరాబాద్‌, బద్వేల్‌ ఉప ఎన్నిక

దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పార్లమెంట్‌, శాసనసభ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. మూడు పార్లమెంట్‌, 30 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో తెలుగు రాష్ట్రాల్లోని హుజూరాబాద్‌, బద్వేల్‌ శాసనసభ నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. హుజురాబాద్‌, బద్వేల్‌లో అక్టోబర్‌ 30న ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. నవంబర్‌ 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఏపీలోని బద్వేల్‌లో వైకాపా ఎమ్మెల్యే డా. వెంకట సుబ్బయ్య మృతిచెందడంతో అక్కడ ఖాళీ ఏర్పడింది. దీంతో ఈసీ అక్కడ కూడా ఉప ఎన్నిక నిర్వహించనుంది.