పొన్నూరు సభకు భారీగా హాజరుకావాలని జనసైనికులకు పిలుపు

పొన్నూరు నియోజకవర్గం, పొన్నూరు మండలంలో ఈ 2-12-21 జరిగిన పత్రికా సమావేశంలో 5-12-21 మధ్యాహ్నం చెరుకుపల్లిలో జరుగు జనసేన బహిరంగ సభకు ఫాఛ్ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా విచ్చేయుచున్నారు. కావున జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు మరియు వీరమహిళలు ప్రజలు అశేషంగా పాల్గొని సభను జయప్రదం చేయవలసిందిగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ నాయబ్ కమల్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, జిల్లా కార్యదర్శి తాలూరు అప్పారావు, సంయుక్త కార్యదర్శి దేశంశెట్టి సూర్య, పొన్నూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు నాగిశెట్టి సుబ్బారావు, చేబ్రోలు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు చందు శ్రీరాములు మరియు జనసేన నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.