కోనేటి హరి వెంకటరమణ కు మద్దతుగా జనసేన నాయకుల ప్రచారం

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోనేటి హరి వెంకటరమణ కు మద్దతుగా జనసేన నాయకులు ప్రచారం నిర్వహించారు. సిద్ధవటం గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగులకి మరియు పట్టభద్రుల ఇళ్లకు వెళ్లి వారిని కోనేటి హరి వెంకటరమణ మేనిఫెస్టో మరియు ఆయన చేసిన పోరాటాలను వివరిస్తూ.. తమ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయమని మరియు వారికి తెలిసిన వారందరి చేత వేయించమని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిద్ధవటం మండలం జనసేన ఇన్చార్జి కొట్టే వెంకట రాజేష్ పసుపులేటి కళ్యాణ్ మరియు బాబు పాల్గొన్నారు.