ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటువంటి పదజాలం వాడవచ్చా?: బంగారు రామదాసు

అరకు నియోజకవర్గం: జనసేన పార్టీ నాయకులు బంగారు రామదాసు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై ద్వజం ఎత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిగారు వ్యక్తిగతంగా విమర్శించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఇటువంటి పదజాలం వాడవచ్చా? నేషనల్ ఇంటర్నేషనల్ అనుకుంటూ ఒకరిని విమర్శించే ముందు ఆలోచించడం తెలియదా? జగన్ మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగతంగా విమర్శించడం తప్ప జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అడిగిన దానికి సరైన సమాధానం ఇవ్వడం మీకు తెలియదా? చేతకాదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సూటిగా రాష్ట్ర అభివృద్ధి కోసం అడుగుతున్నారు ప్రజాక్షేమం కోసం అడుగుతున్నారు ప్రజల పట్ల ఆయన అడుగుతున్నప్పుడు ఆయనకు సమాధానం మీరు మీడియాముందు సభను ఉద్దేశించి మాట్లాడే విధానాలు మీకు రానప్పుడు ఎందుకు మీరు మాట్లాడాలి? ప్రతిదానికి ఆయన మూడు పెళ్లిళ్లు, నేషనల్ పెళ్లిళ్లు, ఇంటర్నేషనల్ పెళ్లిళ్లు ఆయన వ్యక్తిగతం, రాష్ట్రాన్ని ఏం చేస్తున్నారని మీరు రాష్ట్ర ప్రజలకు మీరు ఏమి ఉద్దేశించి చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ అడిగింది పోలవరం ప్రాజెక్ట్, పవన్ కళ్యాణ్ ని అడిగింది ప్రజలకు మంచి సుపరిపాలన, పరిపాలన కావాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకమైనటువంటి పరిపాలన జరుగుతుంది. ప్రశ్నించిన వాడికి తీసుకెళ్లి అరెస్టులు చేయడం కేసులు పెట్టడం బెదిరించడం ఇటువంటి జరుగుతున్నప్పుడు ప్రశ్నించి అడిగే హక్కు లేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరిని అడిగి హక్కులు లేకుండా చేస్తారా? రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటి అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో రోడ్లు లేవు, మంచినీటి సౌకర్యములో లేవు, బ్రిడ్జిలు లేవు, ప్రజలు పండించిన కూరగాయలకు గిట్టుబాటు ధరలు లేవు, చదువుకున్న యువత యువతిలకు ఉద్యోగ అవకాశాలు లేవు, కూలీలు వలస వెళుతున్నారు, వాళ్ళకే ఉపాది లేదు, మద్యపాన నిషేధం అన్నారు అది చేయలేదు. డీఎస్సీ ఉద్యోగం తీస్తామన్నారు అది చేయలేదు. సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు అది చేయలేదు. సిపిఎస్ రద్దు చేస్తామన్నారు. అది చేయలేదు వీటన్నిటి కోసమే అడిగితే దాన్ని మీరు వ్యక్తిగత దోషానికి దిగుతారా? అయన ఇంట్లో ఉన్న సతీమణి కూడ మీరు వదలరు, మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అటువంటివారు, రాష్ట్ర ముఖ్యమంత్రి అటువంటివారు మరి రాష్ట్ర పరిపాలన చేస్తే అదే నాయకులు మాట్లాడితే వీటికి ఏం చెప్పాలి. సభా వరణములు వచ్చిన ప్రజలకు మీరు సభ ఉదేశించి ఏం మాట్లాడుతున్నారు. ఇది సరైనది కాదు, ఇప్పటికైనా మీరు అటువంటి పదజాలలు వాడకుండా ఉంటే మంచిదని మనస్ఫూర్తిగా కోరుచున్నాం. ఈ కావున జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని క్షమాపణ చెప్పాలని అరకు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బంగారు రామదాసు, జనసేన పార్టీ అరకు నియోజకవర్గ నాయకుడు. కొన్నేడి లక్ష్మణరావు, దూరియా సాయిబాబా, శ్రావణ్ పవన్ కోటేశ్వర్ పడాల్, ధనేశ్వరరావు, చిన్నారావు, చందు చిరంజీవి, సురేష్ అరకు నియోజకవర్గం, 6 మండల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.