బొర్రా ఆధ్వర్యంలో భవ్యశ్రీ కుటుంబానికి మద్దతుగా క్యాండిల్ ర్యాలీ

సత్తెనపల్లి నియోజకవర్గం: చిత్తూరు జిల్లా, పెనుమూరు, బలహీనవర్గానికి చెందిన భవ్యశ్రీని హత్య చేసిన హంతకుల్ని తక్షణమే అరెస్ట్ చేయాలంటూ.. భవ్యశ్రీ కుటుంబానికి మద్దతుగా సంఘీభావం తెలిపి కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టడం జరిగినది. అనంతరం ఈ మేరకు స్థానిక తాహశీల్దార్ వారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. చిత్తూరు జిల్లాలో వేణుగోపాల పురంలో మునికృష్ణ పద్మ దంపతుల 16 ఏళ్ల కుమార్తెపై జరిగిన మానవ మృఘాల అఘాత్యాన్ని నిరసిస్తూ సత్తెనపల్లి జనసేన పార్టీ తరుపున నియోజకవర్గం నాయకులు బొర్రా వెంకట్ అప్పారావు ఆధ్వర్యంలో వీరమహిళలు మరియు జనసేన నాయకులు కాండిల్తొ ర్యాలీ నిర్వహించడం జరిగింది. కాండిల్ వెలిగించి చనిపోయిన ఆ పాప కుటుంబానికి నిష్పక్షపాతంగా దోషులను కఠినంగా శిక్ష వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నాయకులు బొర్రా వెంకట్ అప్పారావు మాట్లాడుతూ వైస్సార్సీపీ ప్రభుత్వంలో మహిళా మంత్రులు ఉన్నప్పటికీ స్పందించాకపోవటం బాధాకరం అని అన్నారు. చీటికీ మాటికీ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కుటుంబంపై వ్యక్తి గత విమర్శలు చేయటం తప్ప మంత్రి రోజా గారు, మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ, విడదల రజని, హోమ్ మంత్రి తానేటి వనిత మహిళలు పై, ఆడ పిల్లలపై జరిగే అఘాత్యాలు మాత్రం కనపడవు అని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో 30000 మంది ఆడపిల్లలు, మహిళలు కనిపించకుండా పోయినా పసి పిల్లలపై అఘాయిత్యాలు జరుగుతున్నా వైస్సార్సీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని, పవన్ అన్నను గెలిపిస్తే ప్రభుత్వం ఏర్పడిన తరువాత మహిళలపై ఏదయినా అఘాయిత్యం జరిగితే ఒక్క ఘంట సమయంలోపే వారిని కఠినంగా శిక్ష విధించేలా చేస్తామని పవన్కళ్యాణ్ గారు తెలిపారని భవ్యశ్రీకి న్యాయం జరిగే వరకు జనసేన తరుపున ఎటువంటి పోరాటలకు అయినా సిద్ధం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల అధ్యక్షులు మండల కమిటీ వారు గ్రామ అధ్యక్షులు గ్రామ కమిటీ వారు జనసేన వీరమహిళలు పాల్గొన్నారు.