జనసేన ను ఎదుర్కొలేని.. అనారోగ్య వైసీపీ

ప్రత్యేక హోదా కోసం గతంలో ఎంపీలు రాజీనామా చేశారు కదా.? ఆ తెగువ ఇప్పుడెందుకు చూపించడంలేదు.? అని ప్రశ్నిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

కేంద్రం మెడలు వంచేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతారు కదా.. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు కలిసి విశాఖ స్టీలు ప్లాంటు విషయంలో కేంద్రం మెడలు ఎందుకు వంచలేకపోతున్నారు.? అని పవన్ కళ్యాణ్ నిలదీశారు.

చిత్రమేంటంటే, పవన్ కళ్యాణ్ వేసే ప్రశ్నలు అధికార వైసీపీకి అర్థం కావు. అర్థం అయినా, కాకపోయినా.. అర్థం కానట్లే వైసీపీ నేతలు నటిస్తారు. అలా నటించడం తప్ప వాళ్ళకి ఇంకో మార్గం లేదు. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నాడు.. పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు.. ఇది తప్ప, వైసీపీ నేతలకు ఇంకో ‘పాఠం’ రానే రాదు.

గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో వైసీపీకి, విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ వ్యవహారం గుర్తుకొచ్చింది. ‘కేంద్రం అమ్మేయాలనుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేం కొనుగోలు చేస్తాం..’ అని చెప్పిన వైసీపీ నాయకులు, కేంద్రం విశాఖ స్టీలు ప్లాంటు అమ్మకంపై చర్యలు చేపట్టినా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు ప్రయత్నాలు ప్రారంభం కాలేదు.

సరే, రాష్ట్రానికి ఆ స్తోమత వుందా.? లేదా.? అన్నది వేరే చర్చ. ఆంధ్రప్రదేశ్లో సినిమా టిక్కెట్ల అంశాన్ని పవన్ ప్రస్తావించడం కొందరు వైసీపీ నేతలకు ‘నేరం’గా కనిపించింది. తన ఆర్థిక మూలాల్ని దెబ్బతీసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంటే, ‘ఏం పీక్కుంటారో పీక్కోండి..’ అన్నట్టు సమాధానమివ్వడం తప్పెలా అవుతుంది.? అయితే ఇదే సమయంలో సినిమాలు తనని ఆర్ధికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్న ఏపీ ప్రభుత్వం కి మళ్లీ మాస్ వార్నింగ్ ఇవ్వడం ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.

పవన్ కి ఆర్ధిక మూలం అయ్యినటువంటి సినిమాలకు సంబంధించి ఎప్పుడు నుంచో ఏపీ గవర్నమెంట్ కొత్త కొత్త చట్టాలు తేవడం ఒక్క పవన్ సినిమాలకే కాకుండా టోటల్ టాలీవుడ్ సినిమాలకు దెబ్బ పడేలా చేసింది. మరి దీనిపై మాట్లాడుతూ నిన్న పవన్ కళ్యాణ్ నా ఆర్ధిక మూలాల మీద దెబ్బ కొడితే భయపడతా అనుకున్నారా తనతో కనుక పంథానికి పోతే ఏపీలో ఫ్రీ గా సినిమా నేను చూపిస్తా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనితో వాళ్ళు తగ్గకపోతేన్ నేను కూడా తగ్గను అని మరోసారి క్లియర్ కట్ గా చెప్పేసాడు. మరి ఈ కీలక సమస్య ఎక్కడ ఆగుతుందో చూడాలి.

పదవిలో కూర్చున్నాక ప్రజల తరఫున నిలబడాలనీ, రాష్ట్ర సమస్యలపై కేంద్రాన్ని నిలదీయాలని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే, ఆ చేవలేదు గనుక వైసీపీ
నేతలంతా అడ్డగోలు విమర్శలతో పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడుతున్నారు. పవన్ మీద చేసే విమర్శల్లో పదో వంతు విమర్శలు, కేంద్రంలో
అధికారంలో వున్న బీజేపీ మీద చేసే ధైర్యం వైసీపీకి వుందా.?

పాలించే పదవులు కన్న సామాన్యుడి సేవే మిన్న అనే ఉద్దేశం తో జనసేన ప్రజాసేవ లో మునిగిపొద్ది.. కరోనా సమయం లో జనసైనికులు చేసే సేవలతో జనసేన పార్టీ మీద ప్రజల్లో నమ్మకం ఏర్పడింది. రాజకీయ పార్టీ అంటే స్వార్థ పూరిత రాజకీయాలు మాత్రమే కాదు సేవ ప్రధాన అజెండాగా ముందుకు వెళుతుంది అనే విధంగా దూసుకుపోతున్న ఏకైక పార్టీ జనసేన. బలమైన ఆశయాలతో కూడిన రాజకీయాలు, అవినీతిపై రాజీ లేని పోరాటం చేసే కార్యకర్తలు జనసైనికులు గా ఉన్న ఏకైక రాజకీయ పార్టీ ఉందంటే అది జనసేన పార్టీ మాత్రమే. పదవులు ఆశించకుండా, డబ్బు, మద్యం ప్రలోభాలకు లొంగని జనసైనికులు జనసేన పార్టీ సొంతం. అధికారంలో ఉండి కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క సంక్షేమ పథకం గానీ, పేదలకు ఉపయోగపడే ఏ కార్యక్రమం గానీ వైసీపీ ఎమ్మేల్యే లు ఇప్పటివరకు చేసిన దాఖలాలు లేవు.