అక్షయ్ కుమార్‌కు కరోనా

ముంబయి: బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్‌ కరోనా బారిన పడ్డారు. ఆదివారం వెలువడిన ఫలితాల్లో తనకు కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణైందని సోషల్‌ మీడియా వేదికైన ఇన్‌స్ట్రాగ్రామ్, ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. నిబంధనలకుగుణంగా తాను ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నానని చెప్పారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. త్వరలోగా కోలుకుని..తిరిగి షూటింగ్‌లలో పాల్గొంటానని పేర్కొన్నారు. ప్రస్తుతం అక్షరు రామ్‌సేతు అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో జాక్వలెన్‌ ఫెర్నాండేజ్‌, నౌష్రత్‌ బరూచా హీరోయిన్లుగా నటిస్తున్నారు.