నారా లోకేష్‌పై కేసు నమోదు.. వివరణ కోరుతూ నోటీసులు!

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై కేసు నమోదైంది. కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ విజయవాడ సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇఎస్‌ఐ స్కాంలో అరెస్టయిన సందర్భంలో పరామర్శ కోసం సూర్యారావు పేట కోర్టు సెంటర్‌కు నారా లోకేష్‌, టిడిప నేత కొల్లు రవీంద్ర తదితరులు వెళ్లారు. ఈ సమయంలో లోకేష్‌ కరోనా నిబంధనలు పట్టించుకోలేదని పలువురు ఆయనపై ఫిర్యాదు చేశారు. దీంతో ఎపిడమిక్‌ యాక్ట్‌ ప్రకారం కరోనా వ్యాప్తికి కారణమయ్యారంటూ లోకేష్‌, కొల్లు రవీంద్ర తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా గతేడాది జూన్‌ 12న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసలు ఇప్పుడు వివరణ ఇవ్వాలని నోటీసులు పంపారు.