పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కేసు నమోదు

తిరుపతిలో జనసేన నేతలు అధికార వైసీపీ సోషల్ మీడియా గ్రూపులపై తీవ్రస్థాయిలో స్పందించారు జనసేన నాయకుడు కిరణ్ రాయల్.. పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై తిరుపతి రూరల్ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా కిరణ్ రాయల్ మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా వైసీపీకి చెందిన కొందరు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ మరియు ఆయన కుటుంబ సభ్యులపై అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలను తీవ్రంగా పరిగణించాలని, 48 గంటల్లోపుగా బాధ్యులను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
“వైసీపీ పేటీఎం బ్యాచ్‌కు త్వరలోనే గట్టిగా బుద్ధి చెబుతాం,” అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అనుచరులు సోషల్ మీడియా దుర్వినియోగం చేయడం తగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మనోజ్, సాయి దేవ్, ముని, సాయి తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment